![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -330 లో.....స్కూల్ అనివల్ డే కి కల్చరల్ ఆక్టివిటీస్ మొదలవుతాయి. అందులో భాగంగా ఒక బాబు వెళ్లి స్టేజ్ పై మాట్లాడుతుంటే.. వాళ్ల అమ్మ హెల్ప్ చేస్తుంటుంది. నీకు అలా అమ్మ ఉంటే హెల్ప్ చేసేదని ఫీల్ అవుతున్నావా అని రామ్ ని సీతాకాంత్ అడుగగా.. అలా ఏం లేదు నాకు నువ్వు ఉన్నావ్ కదా.. యూ ఆర్ ది బెస్ట్ నాన్న అని రామ్ అంటాడు. నువ్వు ఆలా అంటున్నావ్ కానీ నీకు బాధ ఉందని నాకు తెలుసని సీతాకాంత్ అనుకుంటాడు. స్టేజి పైకి మైథిలీ తాతయ్య ఫణీంద్ర, నానమ్మ సుశీల లతో కలిసి మైథిలీ స్టేజి పైకి వస్తుంది.
అప్పుడే సీతాకాంత్ కి ఫోన్ రావడంతో పక్కకి వెళ్తాడు. ఫణీంద్ర, సుశీలలు మైథిలీని ప్రైజ్ లు ఇవ్వమని చెప్పి వాళ్ళు కిందకి వచ్చి కూర్చొని ఉంటారు. రామ్ ని ప్రైజ్ అందుకోవడానికి స్టేజ్ పైకి పిలుస్తారు. రామ్ స్టేజి పైకి వెళ్లి ఈ ప్రైజ్ మా నాన్న చేతుల మీదుగా అందుకుంటానని అనగానే సరే అని మైథిలీ అంటుంది. సీతాకాంత్ పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతుంటే అప్పుడే రౌడీ ఫోన్ లో రంగాతో బాంబు గురించి మాట్లాడుతుంటాడు. అదంతా విని సీతాకాంత్ వాడిని పట్టుకొని బాంబ్ ఎక్కడ పెట్టావని అడుగుతాడు. వెంటనే ఆ రౌడీ పారిపోతాడు. సీతాకాంత్ కి ఎం చెయ్యాలో తెలియక ఫణీంద్ర దగ్గరికి వెళ్ళి అతడిని పక్కకు తీసుకొని వెళ్లి ఇలా బాంబ్ పెట్టారట అని చెప్తాడు. ఇది ఆ రంగా గాడి పని అయి ఉంటుందని ఫణీంద్ర అంటాడు. ఇప్పుడు బాంబ్ ఉన్న విషయం ఎవరికి చెప్పొద్దూ.. అందరికి సైలెంట్ గా ఇక్కడ నుండి పంపాలని ఫణీంద్రకి సీతాకాంత్ చెప్తాడు. దాంతో సరే అని ఫణీంద్ర మైథిలీని పిలుస్తాడు. అసలు విషయం చెప్తాడు. దాంతో తను కూడా సీతాకాంత్ లాగే చెప్తుంది. తన కూడా ఇలాగే చెప్పాడని ఫణీంద్ర అనగానే.. ఎవరని మైథిలీ అడుగుతుంది. అతను అని సీతాకాంత్ ని చూపించబోతుంటే అందరు అడ్డుగా వస్తారు. ఆ తర్వాత మైథిలీ చాకచక్యంగా అందరిని బయటకు పంపిస్తుంది.
స్టేజ్ దగ్గర ఒకవైపు మైథిలీ మరోకవైపు సీతాకాంత్ లు బాంబు గురించి వెతుకుతుంటారు. టైమర్ సౌండ్ రావడంతో ఇద్దరు ఒక్కసారి గా గిఫ్ట్ దగ్గరికి వెళ్లి పట్టుకుంటారు. మైథిలీని చూసి సీతాకాంత్ షాక్ అవుతాడు కానీ మైథిలీ.. హలో వదలండి అంటూ అడుగుతుంది. నేను పడేస్తానంటూ సీతాకాంత్ బాంబ్ ని పరిగెత్తుకుంటూ వెళ్లి దూరంగా పారేస్తాడు. ఆ బాంబ్ విసిరేసాక బ్లాస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |